బామ్మర్ది భరత్ అనే నేను సినిమా కథ చెప్పిన ఎంపీ గల్లా

పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన బామ్మర్ది భరత్ అనే నేను సినిమా కథ చదివి వినిపించారు. ఆ సినిమాలో సీఎంగా నటించిన మహేష్ బాబుకి.. తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేశారు. మాట తప్పకూడదు.. అప్పుడు మనం చచ్చిపోయినట్లే అనే డైలాగ్ చదివి వినించారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన NRI కథే ‘భరత్ అనే నేను’ అని అన్నారు. ఆ సినిమాలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తల్లి చెప్పిన మాటకు కట్టుబడి సీఎంగా నిర్ణయాలు తీసుకుంటారని గల్లా ఆ సినిమా స్టోరీని ప్రస్తావించారు.

ఇచ్చిన మాటను నిలుపుకోవాలంటూ ప్రధాని మోడీకి చురకలు అంటించారు. మాట నిలుపుకోలేని మనిషి.. మనిషే కాదంటూ కేంద్రంపై, మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ డైలాగ్స్ ను సభలో చదివి వినిపించారు. ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన మాటను కేంద్రం నిలుపుకోలేదని గల్లా చెప్పారు. మోదీ, అమిత్ షా ఇచ్చిన హామీలను మర్చిపోయారంటూ ఎద్దేవ చేశారు. బీజేపీ వారు కౌంటర్ ఇచ్చారు. హోదా కాదు ప్యాకేజీతోనే అభివృద్ధి సాధ్యం అంటూ ఏపీ అసెంబ్లీలోనే సీఎం చంద్రబాబు తీర్మానం చేయటం.. ఆ తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకుని హోదా అనటంపై ఎద్దేవ చేశారు.

Posted in Uncategorized

Latest Updates