బాయ్ ఫ్రెండ్ తో వీడియో కాల్..యువతి సూసైడ్

mbaహైదరాబాద్ కొంపల్లిలోని ఓ కాలేజీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. MBA సెకండ్ ఇయర్ చదువుతున్న హనీషా చౌదరి అనే అమ్మాయి ఆదివారం(ఫిబ్రవరి-18) కాలేజీ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. హనీషాది అనంతపురం జిల్లా. ఆమె తండ్రి పేరు బుగ్గయ్య చౌదరి. ఆత్మహత్యకు ముందు హనీషా తన ప్రేమికుడి దక్షిష్‌ పటేల్‌తో వీడియోకాల్‌లో మాట్లాడింది. వీడియో కాల్‌లో అతను చూస్తుండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అతను వెంటనే హాస్టల్‌ గదికి చేరుకొని.. లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో తలుపులు బద్దలుకొట్టి తెరిచాడు. ఫ్యాన్‌కు ఉరేసుకున్న హనీషాను అక్కడే ఉన్న స్నేహితురాలి సాయంతో సమీపంలో ఉన్న కొంపల్లి సిగ్మా ఆస్పత్రికి తరలించాడు. ఆస్పత్రికి చేరేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సూసైడ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates