బార్డర్ లోకి అనుకోకుండా వచ్చాం : పాక్

బరితెగించిన పాక్ నిన్న భారత బార్డర్ లోకి రావడంపై స్పందించారు ఆ దేశ అధికారులు. పాక్ -భారత్ బార్డర్ లోకి పొరపాటున వచ్చినట్లు తెలిపారు. భారత ఆర్మీ కాల్పులు జరిపే సమయంలో తాను ఆ హెలికాప్టర్‌ లోనే ఉన్నానని.. తనతో పాటు పీఓకే మంత్రి రాజా ఫరూక్‌ హైదర్‌ ఖాన్‌, ఆయన భద్రతాధికారులు, ప్రొవిన్స్‌ విద్యాశాఖ మంత్రి ఇఫ్తికర్‌ గిలానీలను ఉన్నారని తెలిపారు.

నిజానికి ఎయిర్‌ స్పేస్‌ నిబంధనలు ఉల్లంఘించామని తమకు తెలియదన్నారు. తమపైకి కాల్పులు జరుగుతున్నాయని తెలుసుకున్నామన్న ఆయన.. తమ గమ్యం చేరిన తర్వాత.. ఆ కాల్పులు భారత్‌ నుంచి వచ్చాయని తెలిసిందన్నారు. నియంత్రణ రేఖ వెంబడి పూంచ్‌ జిల్లా గుల్పూర్‌ సెక్టార్‌ లోకి చొచ్చుకొచ్చిన హెలికాప్టర్‌ ను కూల్చివేయడానికి భారత సైనికులు ప్రయత్నించడంతో, వెనక్కి మళ్లిందని భారత అధికారులు చెప్పారు. అది సైనిక హెలికాప్టర్‌ కాదని, గాల్లో చాలా ఎత్తులో చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో మూడు ఫార్వర్డ్‌ పోస్ట్‌ ల్లోని సైనికులు చిన్న తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

ఈ వీడియోల్ని పాక్‌ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. ఐరాసలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాక్‌ పై మండిపడ్డ నెక్స్ట్  రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. నిబంధనల ప్రకారం..LOCలోకి కిలోమీటరు దూరంలోకి హెలికాప్టర్లు, 10 కి.మీ. పరిధిలోకి విమానాలు రావొద్దు. అయితే ఆదివారం (సెప్టెంబర్-30)న బార్డర్ దాటి వచ్చిన హెలికాప్టర్ ను భారత ఆర్మీ అలర్టై..కాల్పులు జరపడంతో వెనక్కి వెళ్లారు.

 

Posted in Uncategorized

Latest Updates