బార్డర్ లో టైట్ సెక్యూరిటీ : ఆరుగురు ఉగ్రవాదుల మృతి

indదేశంలో విధ్వంసానికి ప్లాన్ చేసిన  ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. ఆదివారం (జూన్-10) కెరెన్ సెక్టార్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఆరుగురు ఉగ్రవాదులను చంపేశాయి. వీరి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దులో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

ఇందులో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు చంపేశాయి. కుప్వారా జిల్లాలోని కెరెన్ సెక్టార్ లో నిన్న అర్థరాత్రి దాటాక.. ఉగ్రవాదుల కదలికలను బలగాలు గుర్తించాయి. వారి దగ్గర భారీగా ఆయుధాలు ఉన్నట్టు గుర్తించి.. వెంటనే దాడి మొదలుపెట్టాయి. సైన్యం కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ తర్వాత వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

మరికొందరు ఉగ్రవాదులు తప్పించుకుని ఉంటారన్న అనుమానంతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. కెరెన్ సెక్టార్ లో ఎన్ కౌంటర్ పై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. పాక్ తో శాంతిచర్చలకు భారత్ సిద్ధంగా ఉందని.. అలాగని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదన్నారు. రంజాన్ మాసంలో పవిత్ర యుద్ధంలో చనిపోయే వారంటే దేవుడికి ఇష్టమని చెప్పి.. ఉగ్రవాదులను భారత్ పైకి పాక్ ఉసిగొల్పుతోందన్నారు రక్షణరంగ నిపుణులు పీకే సెహగల్. అలా వచ్చే వారిని భారత సైన్యం దేవుడి దగ్గరికి పంపిస్తోందన్నారు. కెరెన్ సెక్టార్ ఎన్ కౌంటర్ తో వాస్తవాధీన రేఖ దగ్గర భద్రతకట్టుదిట్టం చేశారు. సరిహద్దు గ్రామాల్లో నిఘా పెంచారు.

Posted in Uncategorized

Latest Updates