బార్ లో అటెండర్ : ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్ల చీటింగ్

v6-copyప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌ పేరుతో నిరుద్యోగుల‌ను నిలువునా దోచుకున్నాడు ఓ నిందితుడు . ఫేక్ ఐడీలు, ఆపాయింట్ మెంట్ ఆర్డ‌ర్స్ తో మోసానికి పాల్పడి.. నిరుద్యోగుల‌ నుంచి కోటి 60 ల‌క్ష‌ల‌ వ‌సూలు చేశాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని సెంట్ర‌ల్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి నాలుగు ల‌క్ష‌ల‌ న‌గ‌దు.న‌కిలీ గుర్తింపు కార్డులు. న‌కిలీ నియామ‌క‌ ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆజంపుర‌ కు చెందిన‌ బ‌ద్దం ఎల్లేశ్ డిగ్రీ వ‌ర‌కు చ‌దివి బార్ షాపు లో ప‌నిచేశాడు. బార్ మూసివేయ‌డంతో జాబ్ కోసం వెతుకుతున్న‌ స‌మ‌యంలో సెక్ర‌టేరియ‌ట్ లో ప‌ని చేస్తున్నానంటూ ర‌వీంద్ర‌ స్వామి ప‌రిచ‌యం అయ్యాడు. GHMC, వాట‌ర్ వర్క్స్,ఫారెస్ట్ శాఖ‌ల్లో ప్ర‌భుత్వ‌ శాఖ‌ల‌లో ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని చెప్పాడు. దీంతో ఎల్లేశ్ 2 ల‌క్ష‌లు ఇచ్చాడు. ఒకేసారి ఎక్కువ‌ మందిని చేర్పిస్తే త‌క్కువ‌ ఖ‌ర్చు ఉంటుంద‌ని  అందుకు తెలిసిన‌ వారికి చెప్ప‌మ‌న్నాడు. దీంతో ఎల్లేష్ 37 మంది నిరుద్యోగుల‌ నుంచి కోటి 60 ల‌క్ష‌లు వ‌సూలు చేసి ర‌వీంద్ర‌ స్వామికి ఇచ్చాడు.అందులో కొంత‌ డ‌బ్బును ఎల్లేశ్ కు ఇచ్చాడు.

డబ్బులతో ఉడాయించిన ర‌వీంద్ర‌ స్వామిని క‌రీంన‌గ‌ర్ లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. అయితే ఈజీ మ‌నీ కోసం ఎల్లేశ్ కూడా నిరుద్యోగుల‌ను ఎంచుకుని డ‌బ్బులు వ‌సూలు చేస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసుల‌కు దొరికిపోయాడు. నిందితుని నుంచి ఫేక్ ఐ.డి లు. ఆపాయింట్ మెంట్ ఆర్డ‌ర్స్.4 ల‌క్ష‌ల‌ న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌తి నోటిఫికేష‌న్ ఆన్ లైన్ లో ఉంటుంద‌ని… ఎవ‌రికీ డ‌బ్బులు ఇవ్వాల్సిన‌ అవ‌స‌రం ఉండ‌ద‌ని. ఉద్యోగాల‌ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిరుద్యోగులకు సూచించారు పోలీసులు. మాయ‌ మాట‌లు చెప్పి ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలిప్పిస్తామ‌నే వారి సమాచారం పోలీసుల‌కు ఇవ్వాల‌ని టాస్క్ ఫోర్స్ డిసిపి రాధా కిష‌న్ రావు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates