నందమూరి బాలకృష్ణ పై తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు

నటుడు నందమూరి బాలకృష్ణపై తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్ మక్తాలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు స్పెల్లింగ్ లు నేర్పామనడం సరికాదన్నారు. చంద్రబాబు హయాం కంటే ముందుకూడా హైదరాబాద్ కు ఐటీ అంటే తెలుసని తెలిపారు.  బాలకృష్ణ వ్యాఖ్యలు మొత్తం ఐటీ ఉద్యోగులను హేలనపరిచేలా ఉన్నాయని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భాద్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న బాలకృష్ణ ఇలా మాట్లాడటం బాధాకరమని తెలిపారు. చంద్రబాబు వల్లే ఐటీ అభివృద్ధి జరిగిందని చెప్పి ఇరు రాష్ట్రాల ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. ఎవరో ఒకరి కృషి వల్ల ఐటీ రంగం అభివృద్ధి చెందలేదని చెప్పారు.  ఉద్యోగుల జోలికి రాకుండా తన ప్రచారం తను చేసుకోవడం బెటర్ అని అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates