బాలమేధావి ప్రతిభ : 15 ఏళ్లకే ఇంజినీర్‌ అయ్యాడు

15 ఏళ్లకే ఇంజినీర్‌ గా పట్టభద్రుడు అయ్యాడు  ఓ బాలమేధావి. ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదు అని నిరూపించాడు. భారత సంతతికి చెందిన తనిష్క్‌ అబ్రహం తన మేధస్సుతో అమెరికాలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నవయస్సులోనే చదువులో అసాధారణ ప్రతిభ చాటుతూ.. మూడేళ్ల కిందటే మూడు డిగ్రీలు పొందాడు. ఇప్పుడు బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ లో పట్టభద్రుడైన తనిష్క PHD చేసి.. డాక్టరేట్‌ పట్టా పొందాలని భావిస్తున్నాడు.

15వ ఏట అడుగుపెట్టడానికి కొన్నిరోజుల ముందే ఫాదర్స్‌ డే సందర్భంగా తనిష్క్‌ ఈ డిగ్రీ పట్టా పొందాడు. అక్కడితో అతను ఆగిపోలేదు. వెంటనే యూసీ డేవిస్‌ మెడికల్‌ సెంటర్‌ లో తన సీనియర్‌ డిజైన్‌ ప్రాజెక్టును సమర్పించాడు. అనంతరం సదరన్‌ కాలిఫోర్నియాలో జరిగిన బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ సదస్సులో పాల్గొని.. తన పరిశోధన ప్రాజెక్టు డిజైన్‌ ను సమర్పించాడు. అంతేకాకుండా UCD ఎంటర్‌ ప్రిన్యూర్‌ షిప్‌ అకాడెమీలో నిర్వహించిన 3రోజుల క్రాష్‌ కోర్సులోనూ అతను చేరాడు.

Posted in Uncategorized

Latest Updates