బాలయ్య డిశ్చార్జి

balakrishnashoulderప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కుడి భుజానికి సర్జరీ విజయవంతమైంది. దీంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య గాయపడ్డాడు. నాటి నుంచి ఆయన రొటేటర్ కఫ్ టియర్స్ ఆఫ్ షోల్డర్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కాంటినెంటల్ ఆస్పత్రిలో సర్జరీ కోసం చేరారు బాలయ్య. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీప్తి నందన్‌రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్(పుణె) నేతృత్వంలోని వైద్య బృందం బాలకృష్ణకు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సర్జరీ సుమారు గంటన్నరపాటు జరిగినట్లు చెప్పారు వైద్యులు. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని బాలయ్యకు వైద్యులు సూచించారు.

Posted in Uncategorized

Latest Updates