బాలాపూర్ లడ్డూ రేసులో ఈసారి 29 మంది

బాలాపూర్: రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డూ వేలంలో ఈసారి రికార్డు స్థాయిలో 29 మంది పాల్గొంటున్నారు. గతంలో వేలంలో పాల్గొన్నవాళ్లు 18 మంది పోటీ పడుతున్నారు. కొత్తగా మరో 11మంది పోటీలో నిలిచారు. లడ్డూ వేలంలో 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీని పూర్తిచేసుకుంటున్నాడు బాలాపూర్ గణనాథుడు.

గతేడాది వేలంలో నాగం తిరుపతి రెడ్డి లడ్డు వేలంలో పాల్గొని.. రూ.15 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి వేలంలో మరింత రేటు ఎక్కువ పలుకుతుందని అంటున్నారు. ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం కోసం పోటీదారులు ముందే డీడీ కట్టి రేసులో నిలిచారు. ఈసారి కొత్తగా రేసులో నిలిచిన వారి వివరాలు ఇవి.

పన్నాల కృష్ణా రెడ్డి

కొలన్ రామ్ రెడ్డి

కుప్పి రెడ్డి విజయ భాస్కర్ రెడ్డి

పోరెడ్డి తిరుమల్ రెడ్డి

ఎర్ర మహేశ్వరి

మన్నే బల్వంత్ రెడ్డి

భువనగిరి శ్రీనివాస్ బ్రదర్స్

లొక్క యాది రెడ్డి

కళ్లెం ఎల్లా రెడ్డి

కొత్తవాళ్లతోపాటు..  గతంలో వేలం పాటలో లడ్డు దక్కించుకున్నవాళ్లు వేలం పాటలో పాల్గొంటున్నారు.  లడ్డూ వేలం చూసేందుకు వందలసంఖ్యలో భక్తులు గ్రామానికి చేరుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates