బాలాపూర్ లడ్డూ వేలంపై వివాదం.. నిర్వాహకుల క్లారిటీ

బాలాపూర్ : ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి వివాదం రేపింది. దాదాపు వెయ్యి రూపాయలతో మొదలైన వేలం.. కొద్దిసేపటికే గతేడాది వేలం రేటును చేరుకుంది. ఆ తర్వాత వేలం ఆసక్తికరంగా కొనసాగినప్పటికీ… రెండు మూడు నిమిషాల్లోనే ముగిసింది. రూ.16 లక్షల 60 వేలకు లడ్డూను బాలాపూర్ ఆర్య వైశ్య  సంఘం నేత టి.శ్రీనివాస్ గుప్తా సంఘం తరఫున దక్కించుకున్నారు.

కొందరు వేలం పాడుతున్నప్పటికీ.. శ్రీనివాస్ గుప్తా దగ్గరే ఒకటోసారి.. రెండో సారి.. మూడోసారి చెప్పేశారు నిర్వాహకులు. ఆక్షన్ ముగిసిందని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో… నిర్వాహకులకు.. వేలం పాటలో పాల్గొనేవారికి మధ్య వాగ్వాదం జరిగింది. కొంద అలజడి కలగడంతో.. పోలీసులు కలగజేసుకుని వారికి నచ్చజెప్పారు.

వేలంలో లడ్డూ ధర ఏటికేడు అందకుండా పోతోందని .. అందుకే ఎక్కువ రేటు పలకకుండా లక్ష పెరగ్గానే ఆపేశామని నిర్వాహకులు చెప్పారు. గతేడాది వేలంలోనే ఒకేసారి దాదాపు ఐదు లక్షలు పెరిగిందని.. ఇలాగే పెరిగితే..  ఎగువ మధ్య తరగతి వాళ్లు, వ్యాపారులు ముందుకురారని.. జనం ఆసక్తి చూపరని అన్నారు.  అందుకే తొందరగా ముగించామని బాలాపూర్ గణేశ్ విగ్రహ సమితి తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates