బాలికనే కాదు.. తల్లినీ చంపాడు : సాఫ్ట్ వేర్ ఉద్యోగి దశ్వంత్ కు ఉరిశిక్ష

 మైనర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్ధించింది మద్రాస్‌ హైకోర్టు. ఆ కేసులో దోషిగా తేలిన 23 ఏళ్ల దశ్వంత్‌కు ఉరిశిక్ష సరైనదే అంటూ మంగళవారం తీర్పు వెలువరించింది. చెన్నై సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న దశ్వంత్‌.. గతేడాది ఫిబ్రవరిలో ఏడేళ్ల బాలికకు బొమ్మలు ఆశగా చూపి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్యచేసి.. మృతదేహాన్ని బ్యాగులో పెట్టి హైవే పక్కన కాల్చేశాడు.

ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణ వేగంగా జరిగేలా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు దశ్వంత్‌కు ఉరిశిక్ష విధిస్తూ.. 2019 ఫిబ్రవరి 19న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు దశ్వంత్. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్ధించింది.

కింది కోర్టులో కేసు విచారణ జరుగుతునప్పుడు.. 2017 డిసెంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చాడు దశ్వంత్‌. ఆ సమయంలో అతడు తన తల్లి సరళను చంపి.. ఆమె ఆభరణాలతో ముంబై పారిపోయాడు. చివరకు అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు చెన్నై తరలించారు. ఇప్పుడు తల్లి సరళ హత్య కేసుపై కూడా విచారణ కొనసాగుతోంది.

Posted in Uncategorized

Latest Updates