బాలికపై అత్యాచారం, హత్య కేసు : ఉన్మాదికి మరణ శిక్ష

rapedaswanthఏడేళ్ల బాలికను రేప్ చేసి హత్య చేసిన కేసులో.. చెన్నైలోని మహిళా కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది. ముగలివక్కం అపార్ట్‌మెంట్‌లో నిందితుడు దశ్వంత్.. 2017, జనవరి 5న ఓ బాలికపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత చంపేశాడు. మృతదేహాన్ని ఓ సూట్ కేస్ లో పెట్టి.. రోడ్డు పక్కన పడేశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.

తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికపై అత్యాచారం చేసి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక మృతదేహాన్ని అనకపుత్తూరు దగ్గర ఉన్న బ్రిడ్జి కిందపడేశాడు. ఆ తర్వాత రోజు అక్కడకు వెళ్లి శవాన్ని కాల్చేశాడు. ఇదంతా చేసిన దశ్వంత్.. తానే స్వయంగా బాలిక మృతదేహం కనిపించింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  CCTV  ఫూటేజ్ ఆధారంగా.. దశ్వంత్‌ను నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. 30 మంది సాక్ష్యుల ఆధారంగా దశ్వంత్‌ను దోషిగా తేల్చారు.

జడ్జి వేల్‌మురుగన్ సోమవారం (ఫిబ్రవరి-19) ఈ కేసులో తీర్పును వెలువరించారు. తనకు తక్కువ శిక్ష వేయాలని జడ్జిను నిందితుడు దశ్వంత్ కోరాడు. ఇది తీవ్రమైన నేరం అని.. మరణశిక్ష సరైన తీర్పు అంటూ వ్యాఖ్యానించారు న్యాయమూర్తి..

 

Posted in Uncategorized

Latest Updates