బాలికలదే హవా.. ఇంటర్ ఫలితాలు విడుదల

KADIYAM INTERతెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిసల్ట్స్ విడుదలయ్యాయి. శుక్రవారం (ఏప్రిల్-13) ఉదయం 9 గంటలకు ఇంటర్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 62.3 శాతం విద్యార్థులు ఉత్తర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 4 లక్షల 55 వేల 789 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 2 లక్షల 84 వేల 224 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

4 లక్షల 29 వేల 378 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 2 లక్షల 88 వేల 772 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ లో మేడ్చల్ జిల్లాకు ప్రథమస్థానం లభించగా.. మహబూబ్‌ నగర్ జిల్లా చివరి స్థానంలో ఉంది. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఏప్రిల్ 20 వరకు గడువు విధించారు.
రిసల్ట్స్ కోసం http://www.tsbie.cgg.gov.in/ వెబ్‌ సైట్‌ లో చూడవచ్చు

Posted in Uncategorized

Latest Updates