బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయం

dhanushబాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయవంతమైంది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష సక్సెస్ అయ్యింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణి పరీక్ష చేసినట్లు తెలిపారు రక్షణాధికారులు. భూ, జల త‌లాల నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చన్నారు. ఈ క్షిపణి దాదాపు 500 కిలోల అణ్వస్త్రాలను మోసుకుపోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి-23) ఉదయం 10.52కి ఈ క్షిపణిని పరీక్షించారు అధికారులు.

2015, ఏఫ్రిల్ 9న లో బాలిస్టిక్ క్షిపణి ధనుష్ ను చివరి సారిగా విజయవంతంగా పరీక్షించారు.

Posted in Uncategorized

Latest Updates