బాలీవుడ్ సీనియర్ నటి రీటా భాదురి కన్నుమూత

బాలీవుడ్ సీనియర్ సినీనటీ 62 ఏళ్ల రీటా భాదురి మంగళవారం(జూలై-16) ఉదయం కన్నుమూశారు.సినిమాలు అటు సీరియల్స్‌తో హిందీలో ఫుల్ పాపుల‌ర్ అయిన  రీటా.. కొంత కాలంగా కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కొన్నాళ్లుగా ఆమె డ‌యాల‌సిస్‌పైనే ఆధార‌ప‌డి ఉన్నారు. ప‌ది రోజుల కింద‌ట ముంబైలోని విలే ప‌ర్లే ప్రాంతంలో ఉన్న సుజ‌య్ ఆస్పత్రిలో రీటాని చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు.

ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సుమారు 400 సినిమాలతో పాటు అనేక సీరియల్స్ లో ఆమె నటించారు. అమ్మ, అమ్మమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరు. కబీ హాన్‌ కబీ నా, క్యా కహెనా, దిల్‌ విల్‌ ప్యార్‌ వ్యార్‌, మై మాధురిదీక్షిత్‌ బన్‌నా చాహితీ హూ.. తదితర సినిమాలతో రీటా మంచి గుర్తింపు పొందారు.1970లో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఆమె మృతికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం అంధేరీలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates