బాలీవుడ్ హీరో ఓపెన్ లెటర్ : నేను చావుతో పోరాడుతున్నా..

ipతనకు వచ్చిన వ్యాధి గురించి దాదాపు రెండు నెలల తరువాత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఓపెన్ లెటర్ రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో భయంకరమైన జబ్బుతో ఇర్ఫాన్ ఖాన్ భాధపడుతున్నాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని పతిక్రలు అయితే అరుదైన వ్యాధితో ఇర్ఫాన్ భాధపడుతున్నాడని, ఎక్కువకాలం అతడు బ్రతికే అవకాశం లేదని రాశాయి. అయితే ఇర్ఫాన్ లండన్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని త్వరలో కోలుకునే అవకాశముందని మరికొన్ని పత్రికలు రాశాయి. ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ బాంబే టైమ్స్ పత్రికకు ఓపెన్ లెటర్ రాశాడు ఇర్ఫాన్ ఖాన్.

తాను హై-గ్రేడ్ న్యూరో ఎండోక్రైన్ కాన్సర్ తో భాధపడుతున్నానని, ఇది ఒక అరుదైన వ్యాధి అని తెలుసుకున్నానన్నారు. తాను చావుతో పోరాడుతున్నానని, తెలియని ఆటలో భాగమయ్యానని ఆ లెటర్ లో ఇర్ఫాన్ తెలిపారు. నా ఆరోగ్యం బాగు కోసం ప్రార్ధనలు చేస్తున్న తెలిసిన, తెలియని అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ణతలు తెలియజేస్తున్న అంటూ ఇర్ఫాన్ ఆ లెటర్ లో తెలిపారు. అయితే తన భర్త వారియర్ అని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తెరపైకి వచ్చి ఎప్పటిలాగే ప్రేక్షకులను అతరిస్తాడని ఇర్ఫాన్ ఖాన్ భార్య తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates