బాలుడి ప్రాణం తీసిన బంతి

జగిత్యాల క్రైం వెలుగు : ఆదివారం సెలవు కావడంతో క్రికెట్ ఆడుకుంటానని వెళ్లిన 9 ఏళ్ల బాలుడు శవమై తేలాడు. బాల్ కోసం పరుగెత్తగా ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగింది.

జగిత్యాల రూరల్ మండలం లక్మిపూర్ గ్రామానికి చెందిన ఎడ్మల సత్యం- లావణ్యలకు ఒక్కగానొక్క  కుమారుడు లిఖిత్ రెడ్డి (9).  ఆదివారం సెలవు దినం కావడంతో పక్కనే ఉన్న చెరువు దగ్గర క్రికెట్ ఆడుకునేందుకు ఫ్రెండ్స్ తో సాయంత్రం వెళ్లాడు. అక్కడ క్రికెట్ ఆడుతుండగా బాల్ చెరువులో పడిపోయింది. బంతి కోసం బాలుడు చెరువు దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులోకి జారీ పడి మృతి చెందాడు.లీకిత్ రెడ్డి మృతితో కుటుంబ రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates