బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డ శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్

sriబాల్ టాంప‌రింగ్ వివాదంలో చిక్కుకున్నాడు శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్. వెస్టిండీస్‌ తో జ‌రుగుతున్న టెస్ట్‌లో దినేష్ బాల్ టాంపరింగ్‌కు పాల్ప‌డినట్లు ఐసీసీ తెలిపింది. కోడ్ ఆఫ్ కండ‌క్ట్‌ లెవ‌ల్ 2.2.9ను దినేష్ ఉల్లంఘించిన‌ట్లు ఐసీసీ తెలిపింది. వెస్టిండీస్‌-శ్రీలంక జట్ల మధ్య జరగుతున్న రెండో టెస్టు రెండవ రోజు ఆట సంద‌ర్భంగా బాల్ ఆకారం దెబ్బ తిన్నట్లు భావించిన అంఫైర్లు శనివారం బాల్ మార్చాలని నిర్ణయించారు. దీనికి లంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ అభ్యంతరం వ్యక్తం చేసి, మైదానంలోకి రావడానికి నిరాకరించారు. బాల్ టాంప‌రింగ్‌కు పాల్ప‌డినందుకు పెనాల్టీగా వెస్టిండీస్‌ కు 5 ప‌రుగులు ఇచ్చారు. మళ్లీ లంకేయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫ‌రీ జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్ రంగంలోకి దిగి అంపైర్లు అలీమ్ దార్‌, ఇయాన్ గూల్డ్‌ ల‌తోపాటు లంక కెప్టెన్ దినేష్ చండీమాల్‌ తో మాట్లాడి మ్యాచ్ కొన‌సాగేలా చూశారు.

Posted in Uncategorized

Latest Updates