బాల్ ట్యాంపరింగ్ : స్మిత్, వార్నర్ పై ఆస్ట్రేలియా వేటు

BALTAMPARINGసౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు డబుల్ షాక్ తగిలింది. క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు…ICC చర్యలు తీసుకుంది. ఓ మ్యాచ్ నిషేధం విధిచంటంతో పాటు.. మొత్తం మ్యాచ్ ఫీజును కోత విధించింది. మరోవైపు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన ఆసీస్ ఆటగాడు బెన్ క్రాఫ్ట్ కు మూడో టెస్ట్ లో 75 శాతం కోత విధించింది. అటు స్మిత్, వార్నర్ లను కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

మరోవైపు ఆసీస్ టీమ్ లో మరో ఆటగాడు టీమ్ పైన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బాల్ టాంపరింగ్ పై విచారణ చేపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్  టర్నబుల్  కూడా స్పందించారు. కెప్టెన్ స్మిత్ జట్టు ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. విచారణలో ఉద్దేశపూర్వకంగానే బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు తెలిపారు స్టీవ్ స్మిత్.

IPLలో ఆడతారా..

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం క్రమంలో  స్మిత్, వార్నర్‌ల IPL భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు IPL  చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా.  ఆస్ట్రేలియా బోర్డు, ICC చర్యలు చేపట్టినప్పటికీ… BCCI ఈ విషయమై ఎటువంటి ఆలోచన చేయడం లేదని వివరించారు. BCCIతో సమాలోచన చేశాకే స్మిత్‌పై తమ నిర్ణయం వెలువరిస్తామని తెలిపింది రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ.  వార్నర్‌పై మాత్రం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పందించలేదు.

 

Posted in Uncategorized

Latest Updates