బాల‌య్య‌ను చంపేసింది.. త‌ప్పు దిద్దుకున్న వికీపీడియా

హీరో బాల‌కృష్ణ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. బాల‌య్య బ‌తికుండ‌గానే.. చ‌నిపోయార‌ని సోష‌ల్ మీడియాలో పోస్టింగ్ లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నిజాన్ని స్వ‌యానా వికీపీడియానే వెల్ల‌డించ‌డంతో ..ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్ అయ్యింది. బాల‌కృష్ణ‌ని  బ‌తికి ఉండ‌గానే చంపేసిన ఘ‌న‌త వికీపీడియా సొంతం చేసుకుంది. గూగుల్ లో నందమూరి బాలకృష్ణ పేరుతో ఉన్న వికీపీడియాలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అప్డేట్ చేశారు. డేట్ ఆఫ్ బ‌ర్త్ తో పాటు మ‌ర‌ణించిన డేట్ కూడా ఉండ‌డంతో .. ఇది చూసి షాక్ అయ్యారు నెటిజ‌న్లు.

23 ఏళ్ల క్రితమే .. 1995లోనే బాల‌య్య‌ మరణించినట్టుగా అప్డేట్ చేసింది వికీపీడియా. బెంగుళూరులో మరణించినట్టుగా ప్లేస్ కూడా డిసైడ్ చేసేశారు. కొద్ది సేప‌ట్లోనే ఈ వార్త వైర‌ల్ గా మార‌డంతో .. బాల‌య్య అభిమానులు సీరియ‌స్ అవుతున్నారు. జ‌రిగిన త‌ప్పుని వికీపీడియా స‌రిచేసుకునే లోపే జ‌ర‌గ‌రానిదంతా జ‌రిగిపోవ‌డంతో ఫ్యాన్స్ గూగుల్ కి హెచ్చ‌రిక‌లు పంపారు. మిస్టేక్ ను తెలుసుకున్న వికీపీడియా బాల‌య్య డెత్ డేట్ ని తొల‌గించి అభిమానుల ఆవేశాన్ని చ‌ల్లార్చారు. అయితే అస‌లు త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందంటే కన్నడ నటుడు టీఎన్ బాలకృష్ణ 1995లో మరణించారు. ఆయన సమాచారాన్ని పొర‌పాటున నందమూరి బాలకృష్ణ వికీపీడియాలో అప్డేట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నెటిజ‌న్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates