బావిలో పడిన ఆటో..10మంది మృతి

అతివేగం పది మందిని పొట్టన పెట్టుకుంది. పరిమితికి మించి ప్రయాణం తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.  మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుతామకునే టైంలో మృత్యువు రూపంలో వచ్చిన బావి…మింగేసింది. నిజామాబాద్ జిల్లా మెండోరా సమీపంలో (ఆదివారం,మార్చి-25) అదుపు తప్పిన ఆటో….రోడ్డు పక్కన బావిలో పడిపోయింది. ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు…మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు.

ముప్కాల్ నుంచి మెండోరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో 10 మంది మృతదేహాలను బయటకు తీశారు అధికారులు..అయితే మరో నలుగురిలో ఒకరి ఆచూకి మాత్రమే దొరికింది. డ్రైవర్ తో పాటు మరో ఇద్దరి కోసం బావీలో గాలిస్తున్నారు అధికారు. మోటర్ల ద్వారా బావీలోని నీటిని బయటకు తీసుకున్నారు.

చనిపోయిన 10 మృతదేహాలను ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు అధికారులు. దీంతో ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. మరోవైపు స్పందించిన మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డిలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిజామాబాద్ కలెక్టర్ రాంమోహన్ తో మాట్లాడిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి….ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి….గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని కలెక్టర్ కు సూచించారు.  డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు అచూకీ కోసం వెతుకున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates