బాసరలో జోరుగా కల్తీకల్లు దందా

KALLUబాసరలో కల్తీకల్లు దందా జోరుగా నడుస్తోంది. బాసర ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్, దాని పక్కనున్న స్థలం కల్తీకల్లుకి అడ్డాగా మారింది. గ్రామంలో ఉన్న కొన్ని చెట్లను చూపించి.. కల్లు వ్యాపారాన్ని చేస్తున్నారు. బాసర చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా మహారాష్ట్రకి పెద్దఎత్తున ఈ కల్తీకల్లును సరఫరా చేస్తున్నారు.

కల్లును ప్యాకెట్లలో నింపి.. ఒక సంచిలో ప్యాక్ చేసి రైళ్లలో మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. బాసర స్టేషన్ దగ్గర ఒక్కో కల్లు ప్యాకెట్ 5 రూపాయలకు కొని పక్కనున్న మహారాష్ట్రలో 25 రూపాయల వరకు అమ్ముతున్నారు కల్లు వ్యాపారులు. రైళ్లలో యదేచ్చగా సాగే ఈ కల్తీకల్లు వ్యాపారానికి ఇక్కడి రైల్వే సిబ్బంది సహకారం ఉందనే ఆరోపణలున్నాయి.

బాసరలో తయారయ్యే కల్లులో మత్తు వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారని కల్తీ కల్లు బాధిత కుటుంబాలంటున్నాయి. ఈ కల్తీ కల్లు తాగి బాసర మండలంలో ఐదుగురు చనిపోగా.. పలువురు మతి స్థిమితం లేకుండా పోయారని చెబుతున్నారు. ఈ కల్తీ కల్లుతో.. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి కల్తీ దందాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక యువకులు. కల్లు కల్తీపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

కల్తీకల్లుపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నామంటున్నారు ఎక్సైజ్ అధికారులు. రసాయనాలు కలిపిన కల్లు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రకి కల్తీ కల్లు తరలింపుపై నిఘా పెంచుతామంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో కల్లుకు పర్మీషన్ ఇవ్వడమే తప్పంటున్నారు బాసర గ్రామస్థులు. కల్తీ కల్లుతో చనిపోయిన వారిన కుటుంబాలను ఆదుకోవడంతో పాటు.. ఈ కల్తీ దందాపై సర్కార్ ఉక్కుపాదం మోపాలను కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates