బాసరలో బారులు తీరిన భక్తులు

2093ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసరలో ఇవాళ బారులు తీరారు  భక్త జనం. సోమవారం( ఈ రోజు) ఏకాదశి మంచిరోజు  కావడంతో భక్తుల రాకకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కరోజు ముందు నుంచే భక్తులు బాసర దారిపట్టారు. ఉదయం భక్తులు గోదావరి నిత్యహారతిలో పాల్గొని అమ్మవారి చెంతకు చేరుకున్నారు. పెద్దఎత్తున చిన్న పిల్లలకు అక్షరాభాస్యం చేయిస్తున్నారు. మరికొందరు అమ్మవారికి ఒడి బియ్యం, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా  భక్తులు తరలిరావడంతో అమ్మవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

Posted in Uncategorized

Latest Updates