బిగ్‌ బాస్‌ కు ఇక సెలవు : నాని

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ -2 ఇవాళ (సెప్టెంబర్-30)న గ్రాండ్ గా ముగిసింది. విన్నర్ గా కౌశల్ నిలిచాడు. చీఫ్ గెస్ట్ గా వచ్చిన విక్టరీ వెంకటేష్ చేతులమీదుగా రూ. 50 ల‌క్ష‌ల‌ క్యాష్ ను అందుకున్నాడు కౌశల్. తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కు బై బై చెప్పేశాడు నాని. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడు.

బిగ్ బాస్2 హోస్ట్ గా అదే తన లాస్ట్ రోజని ట్వీట్ చేశాడు నాని. ప్రేక్షకుల్ని అలరించడానికి తనవంతుగా కష్టపడ్డానని చెప్పాడు. “నా వరకు ద బెస్ట్‌ ఇచ్చాను. ఇది ఓ అద్భుతమైన అనుభూతి. చాలా నేర్చుకున్నా, చాలా నేర్చుకోలేదు. నన్ను, నా షోను ఇష్టపడ్డవారికి థాంక్స్.  షో నచ్చని వారిని థియేటర్లో కలుస్తా” అంటూ నవ్వుతూ.. బిగ్‌ బాస్‌ కు ఇక సెలవు అని ట్వీట్ చేశాడు నాని.

 

Posted in Uncategorized

Latest Updates