బిగ్‌ బాస్‌-2 విన్నర్‌ కౌశల్‌

తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫైనల్ ఆదివారం (సెప్టెంబర్-30)న గ్రాండ్ గా ముగిసింది. బిగ్‌బాస్ తెలుగు -2 రియాలిటీ షో విజేతగా కౌశల్‌ నిలిచాడు.  113 రోజులు పాటు సాగిన ఈ షోలో బిగ్ బాస్-2 విన్నర్ ఎవరో తెలిసే ఎపిసోడ్ ఇవాళ థ్రిల్లింగ్ గా జరిగింది. కౌశల్, గీతా మాధురి, తనీష్, సామ్రాట్, దీప్తి నల్లమోతు ఫైనల్ కంటెస్టంట్స్ కాగా వారిలో కౌశల్ విజేతగా నిలిచాడు.

గీతా మాధురి రన్నరప్‌గా నిలిచింది. ఓటింగ్‌లో అత్యధికంగా ఓట్లు సాధించిన కౌశల్‌ ను ప్రకటించారు. అంతకు ముందు ఫైనలిస్టులు ఇద్దరినీ నాని స్వయంగా స్టేజి మీదకు తీసుకువచ్చారు. హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గీత మాధురి తీవ్ర ఉద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకుంది. ఈ గ్రాండ్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ రావడం విశేషం, బొబ్బిలి రాజా సినిమాలోని బలపం పట్టి భామ వడిలో పాటతో వెంకీ ఎంట్రీ ఇచ్చి హౌస్ ను అలరించాడు. మొదటి నుండి తన మీద నెగటివ్ ఇంప్రెషన్ తో ఉన్న హౌజ్ మెట్స్ ప్రతి టాస్కులో కౌశల్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ ఫైట్ లో కౌశల్ రియల్ హీరోగా విజేతగా నిలిచాడు. కౌశల్ విజేతగా నిలవడంలో కౌశల్ ఆర్మీ ప్రభావం బాగా ఉంది. అంతేకాదు బిగ్ బాస్ ఫాలో అయ్యే సగటు ప్రేక్షకులు కూడా కౌశల్ కు ఓటేసినట్టు తెలుస్తుంది. వెంకటేష్ చేతుల మీదుగా కౌశల్ 50 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు.

కౌశల్ ప్రస్థావన..

కౌశ‌ల్  ఓ సాధార‌ణ మోడ‌ల్‌ గా, సీరియ‌ల్స్ న‌టుడిగా బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి అడుగుపెట్టాడు. కానీ.. అసాధార‌ణ వ్యక్తిత్వంతో కోట్లాది మందిని ప్రభావితం చేశాడు. ప్రధానంగా తన ముక్కుసూటితనం అతనికి కలిసొచ్చింది. అదే సమయంలో బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఇచ్చే టాస్క్‌ ల్లో కూడా కౌశల్‌ తనదైన ముద్ర వేశాడు. బిగ్‌ బాస్ సుదీర్ఘ జ‌ర్నీలో ఫస్ట్ నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒంట‌రి పోరాటం చేస్తూ.. బిగ్‌ బాస్ గేమ్ షోకే ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాడ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కౌశ‌ల్ పేరు దేశ‌విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల నోటివెంట వంద రోజులుగా ప‌లుకుతూనే ఉంది. కౌశ‌ల్ ఆర్మీ పేరుతో ప్రత్యేక ఫ్యాన్స్‌  సంఘం ఏర్పడింది. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, కాకినాడ‌, రాజ‌మండ్రి లాంటి అనేక ప్రాంతాల్లో కౌశ‌ల్ ఆర్మీ 2కే రన్‌ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూనే పలు స్వచ్ఛంద కార్యక‍్రమాల్లో పాలు పంచుకుంది.

బిగ్ బాస్-2 విన్నర్ గా నిలిచిన కౌశల్ కు ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు పలువురు సినీస్టార్స్.

Posted in Uncategorized

Latest Updates