బిగ్ డెవలప్ మెంట్ : అమీర్ పేట – ఎల్బీనగర్ మెట్రో ట్రయల్ రన్

చాొిే
మెట్రో ప్రాజెక్ట్ లో బిగ్ డెవలప్ మెంట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమీర్ పేట – ఎల్బీనగర్ మెట్రో ట్రయల్ రన్ ప్రారంభం అయ్యింది. అన్ని అనుమతులు రావటంతో.. ట్రయల్ రన్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అదే రైలులో ప్రయాణించారు మంత్రి కేటీఆర్, మంత్రి మహేందర్ రెడ్డి.

మెట్రో ఫేజ్-2 పనులను మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. జూలై చివరి నాటికి మెట్రో ఫేజ్-2 త్వరలోనే అందుబాటులోకి రానుంది.ఈ లైన్ ప్రారంభంతో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు పూర్తవుతుంది. దీంతో 45 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఇక అక్టోబర్ నెలలోనే హైటెక్ సిటీ – అమీర్ పేట అందుబాటులోకి వస్తుందన్నారు.

ఇక అక్టోబర్ నెలలోనే హైటెక్ సిటీ – అమీర్ పేట అందుబాటులోకి వస్తుందన్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించటానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రోను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. తొలి దశ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. మెట్రోతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయని చెప్పారు. నాంపల్లి రైల్వేస్టేషన్, MGBSను మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు.

నగరంలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని చెప్పారు. 500ల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. మియాపూర్ స్టేషన్‌లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ మెట్రోకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం మెట్రోరైలు నాగోల్ నుంచి వయా అమీర్ పేట్ నుంచి మియాపూర్ కు నడుస్తోంది. ఇందులో రోజుకు 80 వేలకు పైగా ప్రజలు ప్రయాణిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates