బిగ్ బాస్ నుంచి ఎన్టీఆర్ ఔట్

NTRఓ ఛానల్ లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 2 నుంచి తప్పుకున్నాడు ఈ హీరో. జూలై నుంచి షో ప్రారంభం కావాల్సి ఉంది. సీజన్ 2కి కూడా ఎన్టీఆర్ హాస్ట్ గా ఉంటారని ప్రకటించిన తర్వాత.. ఇలా బయటకు వస్తున్నట్లు ప్రకటించటం చర్చనీయాంశం అయ్యింది.

ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇప్పుడు మాత్రం బరువు తగ్గే ఫిట్ నెస్ చికిత్సలో ఉన్నాడు. మార్చి 23 నుంచి త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. జూలై చివరి నాటికి ఆ మూవీ కంప్లీట్ చేసుకుని.. రాజమౌళి ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడు జూనియర్. దీనికితోడు కుటుంబానికి సంబంధించి కొన్ని వ్యక్తిగత పనులు కూడా ఉన్నాయి. రెండు సినిమాలతోపాటు ఫ్యామిలీ పనుల్లో బిజీగా ఉండటంతో.. సీజన్ 2కి టైం ఇవ్వటం కష్టంగా మారింది. దీంతో షో నుంచి తప్పుకున్నట్లు బుల్లితెరతోపాటు సినీ ఇండస్ట్రీలో చర్చ అయ్యింది. ఎన్టీఆర్ నో చెప్పటంతో.. ఇప్పుడు ఆ ఛానల్ కొత్త హోస్ట్ హీరో వెతుకులాటలో పడింది.

Posted in Uncategorized

Latest Updates