బిగ్ బాస్ షో-2: ఫైనల్ లిస్టు ఇదే

bigboss-2బిగ్‌ బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా ఆదివారం(జూన్-10) సాయంత్రం రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సింగర్‌ గీతా మాధురి, తేజస్వి,నటులు అమిత్‌ తివారీ, తనీష్‌,సామ్రాట్‌,యాంకర్‌ దీప్తి, బాబు గోగినేని,రోల్‌ రిడా,శ్యామల, కిరీటి ధర్మరాజు, దీప్తీ సునయన, సీరియల్‌ నటుడు కౌశల్‌, భాను. ఈ 13 మంది సెలబ్రిటీలు కాకుండా గణేశ్‌‌, సంజన, నూతన్‌ నాయుడు అనే ముగ్గురు కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం.

మొదటి సీజన్‌ బంపర్‌ హిట్‌ కావటంతో… బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సెకండ్‌ సీజన్‌ వంద రోజులపాటు సాగనుంది.

Posted in Uncategorized

Latest Updates