బిగ్ బాస్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం.. తగులబడిన సెట్ లు

jhgకన్నడ బిగ్ బాస్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రామనగర జిల్లా, బిడిదిలోని ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌సిటీలో ఈ రోజు(ఫిబ్రవరి22) ఉదయం 3 గంటల సమయంలో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో బిగ్‌ బాస్‌ స్టూడియో పూర్తిగా దగ్ధమైంది. బిగ్‌ బాస్ భారీ సెట్టింగులు తగులబడిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందటంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు ఫిల్మ్ సిటీ అధికారులు భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates