బిడ్డకు జన్మనిచ్చిన పురుష్ ట్రాన్స్ జెండర్

babyహార్మోన్ల చికిత్స ద్వారా పురుషుడిగా మారిన మొట్టమొదటి ఫిన్లాండ్‌ ట్రాన్స్‌జెండర్‌ ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. ఈ విషయం ప్రసవం జరిగిన రెండు వారాలకు వెలుగులోకొచ్చింది. బిడ్డ జన్మించిన సమయంలో 4 కేజీల బరువు, 53 సెంటీమీటర్ల పొడవు ఉందని ఆ ట్రాన్స్‌జెండర్‌ స్థానిక మీడియాకు వెల్లడించాడు. అయితే తన కుటుంబ గోప్యతను దృష్టిలో పెట్టుకొని అతని పేరును మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి 2015లో టెస్టోస్టెరాన్‌ థెరపీ ద్వారా మహిళ నుంచి పురుషుడిగా మారాడు.

అతడు గర్భం దాల్చడానికి ముందే లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉన్నా దాన్ని వద్దనుకున్నాడు. ఫిన్లాండ్‌ చట్టం ప్రకారం హార్మోనల్‌ థెరపీ ద్వారా మహిళ నుంచి పురుషుడిగా మారాలనుకునే వ్యక్తి తాను పునరుత్పత్తి చేయలేని స్థితిలో ఉన్నట్టు నిరూపించుకోవాలి. బిడ్డకు జన్మనిచ్చిన అతనికి పితృత్వపు సెలవులు కూడా మంజూరయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates