బిడ్డలు పెట్టిన క్షోభ : వృద్ధాశ్రమంలో బాలీవుడ్ నటి కన్నుమూత

PAKEవెటరన్ బాలీవుడ్ నటి, పాకీజా మూవీ హీరోయిన్  గీతాకపూర్(67) శనివారం(మే-26) ఉదయం కన్నుమూశారు. ముంబైలోని SRV హాస్పిటల్ లో ఈ రోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. గీతాకపూర్ 100కు పైగా సినిమాల్లో నటించారు. పాకీజా మూవీ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. గీతాకపూర్ కి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. గీతాకపూర్ కొడుకు గత సంవత్సరం ఏప్రిల్ లో ఆమెను హాస్పిటల్ లో వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకూ ఆమెను చూడటానికి కూడా రాలేదు.

దీంతో సీనీ ప్రముఖులు అశోక్ పండిట్, రమేష్ తౌరాణి ఆమె హాస్పిటల్ ఖర్చులు భరిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని తమ వంతు ప్రయాత్నాలు చేశారు. ఏడాది నుంచి కొడుకు, కూతురు తనను చూడడానికి వస్తారని ఎదరుచూసిందని, కానీ వాళ్లు వచ్చి కలవలేదని తెలిపాడు అశోక్ పండిట్. ఆ భాధతోనే రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించి.. ఈ రోజు ఉదయం గీతాకపూర్ చనిపోయినట్లు వెల్లడించారు. అశోక్ పండిట్ మాజీ CBFC మెంబర్ గా పనిచేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఆస్పత్రిలోనే భద్రపరిచారు. కుమారుడు, కూతురు వస్తే వారికి అప్పగించాలని నిర్ణయించారు. వారు రాకపోతే బంధువులు అయినా తీసుకెళతారో లేదో చూడాలి అంటున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు. ఆ తర్వాతే ఆమె అంత్యక్రియలపై నిర్ణయం తీసుకుంటాం అని బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంటోంది. 100 సినిమాల్లో నటించి.. ఎంతో కీర్తి సాధించిన పాకీజా హీరోయిన్ గీతాకపూర్ జీవితం ఓ గుణపాఠం అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates