బిడ్డ పుట్టిన రెండు గంటల్లో ఆధార్, పాస్ పోర్ట్, రేషన్ కార్డు

సూరత్ : అప్పుడే పుట్టిన బిడ్డకు రెండు గంటల్లో ఆధార్‌, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు లభించింది. పుట్టిన వెంటనే అన్ని గుర్తింపు పత్రాలు పొందాలన్న కలను ఆ తల్లిదండ్రులు నెరవేర్చుకున్నారు. గుజరాత్‌కు చెందిన అంకిత్‌ దంపతులకు డిసెంబరు 12న… పాప పుట్టింది. రమైయా అని ఆమెకు పేరు పెట్టారు.

ప్రధాని మోడీ తీసుకొచ్చిన ‘డిజిటల్ ఇండియా’ యాప్ లో బిడ్డ డీటెయిల్స్ , తమ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశారు. ‘పుట్టిన వెంటనే అన్ని రకాల గుర్తింపు పత్రాలున్న చిన్నారి’గా తన బిడ్డకు గుర్తింపునివ్వాలని ఆ తల్లిదండ్రులు ఈ ప్రయత్నం చేశారు. ముందుగానే కొన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసి.. బిడ్డ పుట్టగానే బర్త్ సర్టిఫికెట్ తో వెంటనే అప్ లోడ్ చేశారు. అలా.. రెండు గంటల్లోనే బేబీకి ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, రేషన్ కార్డ్ సంపాదించగలిగారు ఆ తల్లిదండ్రులు.

మహారాష్ట్రకు చెందిన తల్లిదండ్రులు.. తమ బిడ్డకు ఇంతకంటే వేగంగా ధ్రువీకరణ పత్రాలను సమకూర్చారు. గంటా 48 నిమిషాలకే ఆధార్ కార్డ్ కోసం పేరు నమోదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates