బిల్డింగ్ పైనుంచి దూకేశాడు : చైతన్య కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్య

chaitanyaహైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా కే.రామచంద్రాపురం కు చెందిన అభికుమార్ రెడ్డి అనే విద్యార్ధి  హైదర్ నగర్ లోని చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ కాలేజీకి చెందిన  హాస్టల్ లో ఉంటున్నాడు. ఏమైందో తెలియదు కానీ శనివారం( జూన్-23) ఉదయం 5 గంటల సమయంలో హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తునుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అభికుమార్ రెడ్డి.

అభికుమార్‌ ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. అభికుమార్‌ మృతి పట్ల అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదో అంతస్తు నుంచి దూకినా.. కాలి మీద చిన్న దెబ్బ తప్ప.. గాయాలు కాలేదని అంటున్నారు. చదువు కోసం తన కొడుకును పంపిస్తే… శవంగా మార్చేసారని కాలేజీ యాజమాన్యం పై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ వేధింపుల కారణంగానే తమ కొడుకు చనిపోయాడని  ఆరోపిస్తున్నారు. సూసైట్ నోట్ బయటపెట్టాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates