బిల్డింగ్ పై నుంచి దూకి ఓ వ్యక్తి మృతి

bui సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. బిల్డింగ్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ రోజు ఉదయం(ఫిబ్రవరి14) మహంకాళి పోలీసు స్టేషన్ పరిధిలోని సింధి కాలనీకి చెందిన సునీల్(45) ఉదయం 9.30 గంటల సమయంలో చెనాయ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సునీల్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates