బిల్డింగ్ పై నుంచి దూకి రైటర్ సూసైడ్

బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు బాలీవుడ్ సినిమా రైటర్. ఈ సంఘటన బుధవారం (జూలై-11) ముంబైలో జరిగింది. రవిశంకర్ అలోక్ (32) అనే రచయిత ముంబైలోని ఓ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంధేరీ వెస్ట్‌ లోని సెవన్ బంగ్లాస్ ఏరియాలో అతను నివాసం ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతను అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

నానా పటేకర్ నటించిన అబ్ తక్ చప్పన్ సినిమాకి  రచయితగా పనిచేశాడు రవిశంకర్. అతని ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపిన పోలీసులు..రవిశంకర్ డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు చెప్పారు. మానసిక వైద్యం కూడా తీసుకున్నట్లు చెప్పారు బంధువులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates