బిల్లులు వెంటనే విడుదల చేయండి : సీఎస్ కు బిల్డర్స్ రిక్వెస్ట్

హైదరాబాద్ : సెక్రటేరియట్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. నిధులు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ పనులను నిలిపివేశామని బిల్డర్స్ ప్రతినిధి డీవీఎన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో  ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు చెల్లించాల్సిన బిల్లులు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం.. విడుదల చేయాల్సిన బిల్లులు ఇంకా విడుదల చేయకపోవడం వలన.. పనులకు ఇబ్బంది ఎదురవుతోందని చెప్పారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని సీఎస్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Posted in Uncategorized

Latest Updates