బీచ్ లో గందరగోళం.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత వస్తువు

సౌత్ కరోలినా : కొత్తది ఏది కనిపించినా వింతే. యునైటెడ్ స్టేట్స్ లోని సౌత్ కరోలినాలో అదే జరిగింది. అక్కడి సముద్ర తీరానికి ఓ వింత వస్తువు కొట్టుకొచ్చింది. అది చూసిన జనం ఒక్కసారిగా షాకయ్యారు. అది గ్రహాంతరవాసుల వస్తువై ఉంటుందా… స్పేస్ నుంచి సముద్రంలోకి ఊడిపడిందా… దాంతో ఏదైనా ప్రమాదం జరగనుందా.. లాంటి డౌట్లు.. బీచ్ లోకి వచ్చినవారిని టెన్షన్ పెట్టాయి. చాలామంది ఆశ్చర్యంతో ఫొటోలు తీసుకుని.. ఆసక్తిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ అకౌంట్.. ఈ అకౌంట్ ఇలా… అంతటా షేర్ అయ్యేసరికి… ఆ సిలిండ్రికల్ వస్తువు వైరల్ అయ్యింది. దీంతో.. పురాతత్వ శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీని సంగతేంటో చూద్దామని బయల్దేరారు. ఆ వస్తువును గమనించి.. అసలు విషయం చెప్పేశారు. ఇది అంతరిక్ష వస్తువు కాదని.. ఇది కొన్ని వందల ఏళ్లు సముద్రంలో ఉండిపోయిన ఓ ఇనుప పైప్ లైన్ ముక్క అని తేల్చేశారు. ఎక్కడే విరిగిపోవడంతో.. ఇలా కొట్టుకొచ్చిందని చెప్పారు. కొన్నేళ్లపాటు నీళ్లలో ఉండటంతో… దాని చుట్టూ ఎన్నో లేయర్లు ఏర్పడి పెద్దదైపోయిందని చెప్పారు. అధికారులు దాన్ని అక్కడినుంచి తొలగించేశారు.

Posted in Uncategorized

Latest Updates