బీజేపీకి ఊహించని షాక్ : రేపే యడ్యూరప్ప బలపరీక్ష

supreme-court

కర్నాటక రాజకీయంలో సంచలన పరిణామం. సుప్రీంకోర్టులో జరిగిన వాదనల తర్వాత కీలక ఆదేశాలు ఇచ్చింది. రేపు ( మే 19-శనివారం) అసెంబ్లీలో బలపరీక్షకి సిద్ధం కావాలని బీజేపీని ఆదేశించింది. వారం రోజుల గడువు కోరింది బీజేపీ.  గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారని.. ఇప్పుడు వారం ఇచ్చినా పర్వాలేదని కోర్టులో వాదించారు బీజేపీ తరపు న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ. రేపు బలనిరూపణకు సిద్ధంగా లేమని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే కాంగ్రెస్ – జేడీఎస్ మాత్రం రేపు బలపరీక్ష ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని కోర్టుకి తెలిపింది. యడ్యూరప్పకి 104 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని.. ఏ విధంగా మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు కూడగడతారో చెప్పాలని కోర్టులోనే డిమాండ్ చేశారు కాంగ్రెస్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.  కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ పెంచాలని కోరారు.

ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. మే 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు కర్నాటక అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సీఎం యడ్యూరప్పని ఆదేశించింది. లేకపోతే ప్రమాణస్వీకారంపైనే సమీక్ష చేయాల్సి ఉంటుందని సంచలన కామెంట్స్ చేసింది కోర్టు. సీక్రెట్ ఓటింగ్ పద్దతిలో బలపరీక్ష నిర్వహించాలన్న బీజేపీ లాయర్ రోహత్గీ రిక్వెస్ట్ ను కూడా కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో బీజేపీకి ఇది ఊహించని ఎదురుదెబ్బ.

Posted in Uncategorized

Latest Updates