బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదు : మాయావతి

బీజేపీ, కాంగ్రెస్ లపై తీవ్ర విమర్శలు చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో  కాంగ్రెస్.. బీజేపీకి ఏ మాత్రం తీసిపోదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ బెదిరిస్తుందని ఆరోపించారు.  మధ్య ప్రదేశ్ లోని గుణ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న తమ అభ్యర్థిని కాంగ్రెస్ బలవంతంగా  రేసు నుంచి తప్పుకునేలా చేసిందని .. దీనికి తాము తగిన బుద్ది చెబుతామని ఆమె బదులిచ్చారు. మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ కు తమ మద్దతు కొనసాగింపుపై కూడా పునరాలోచిస్తామని  అన్నారు మాయావతి.

Latest Updates