బీజేపీకి బిగ్ షాక్…..కాంగ్రెస్ లోకి జశ్వంత్ సింగ్!

అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగనున్న రాజస్తాన్‌ లో అధికార బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. మాజీ కేంద్రమంత్రి జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు, షియో  MLA మన్వేంద్ర సింగ్‌ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ(సెప్టెంబర్-22) ప్రకటించారు. బర్మేర్‌ జిల్లాల్లో శనివారం తన అభిమానులతో కలిసి ‘స్వాభిమాన్‌ ర్యాలీ’ నిర్వహించిన మన్వేంద్ర.. బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2014 లోక్‌ సభ ఎన్నికల్లో తన తండ్రికి ఎంపీ సీటు ఇవ్వకుండా బీజేపీ తీవ్రంగా అవమానించిందని, ఇన్ని రోజులు ఒపిక పట్టామని ఇక సహించేదిలేదని మన్వేంద్ర సింగ్ అన్నారు. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారనేదానిపై మన్వేంద్ర సింగ్ క్లారిటీ ఇవ్వలేదు.
కాంగ్రెస్ లో చేరబోతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ….మద్దతుదారులు ఏం చేయని చెప్పారో అదే చేస్తానని తెలిపారు. మద్దతుదారుల నిర్ణయమే తన నిర్ణయమన్నారు.ప్రతి ఒక్కరి అభిప్రాయంకోరతానన్నారు.

సీఎం వసుంధర రాజే ఇటీవల బర్మేర్‌ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా పార్టీకి దూరంగానే ఉన్నారు మన్వేంద్ర . వసుంధర రాజే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గౌరవ్‌ యాత్రపై కూడా తీవ్రంగా మండిపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates