బీజేపీకి షాక్: పాశ్వాన్ బాటలో నితీష్

SC,STల బిల్లును నీరుగార్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ లోక్‌ జనశక్తి పార్టీ (LJP) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. తాజాగా అదే బాట పట్టింది నితీష్ కుమార్ జనతా దళ్ యునైటెడ్ (JDU). దళితులపై అత్యాచారాలకు పాల్పడే వారిపై తీసుకునే కఠిన చర్యలను తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని LJP అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అల్టిమేటం ఇచ్చారు. దీనికి మద్దతుగా… జేడీయూ కూడా   SC,ST చట్టంపై ఆర్డినెన్స్ తీసుకురావడం కానీ, సవరణ బిల్లును ప్రవేశపెట్టడం కానీ చేయాలని డిమాండ్ చేసింది.

దళితుల ఆందోళనను పట్టించుకోకుంటే రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లను బీజేపీ కోల్పోవడం తప్పదని JDU జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. SC,ST వేధింపుల చట్టం పాత నియమాలను పునరుద్ధరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకుంటే ఆగస్టు 9న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని పాశ్వాన్ చేసిన హెచ్చరికలను త్యాగి సమర్ధించారు.

 

 

Posted in Uncategorized

Latest Updates