బీజేపీతో పొత్తు…విషం త్రాగడమే : మెహబూబా ముఫ్తీ

బీజేపీతో తెగదెంపుల తర్వాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పీడీపీ అధ్యక్షురాలు, జమ్ము-కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో….పీడీపీ-బీజేపీ మధ్య మంచి సంబంధాలుండేవని, అందువల్లనే బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు మెహబూబా ముఫ్తీ. మోడీ హయాంలో బీజేపీతో పొట్టుపెట్టుకోవడం అంటే విషం త్రాగడమే అని ముఫ్తీ అన్నారు.సోమవారం(జులై-30) పీడీపీ 19వ ఫౌండేషన్ డే సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని….. 26 నెలల ముఖ్యంత్రిగా తాను అనేక సమస్యలను ఎదుర్కొన్నానని ముఫ్తీ తెలిపారు. జూన్-19, 2018న పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో…. సీఎం పదవికి ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. 2014 చివర్లో జరిగిన జమ్ము-కశ్మీర్ ఎన్నికల్లో పీడీపీ తరపున 28 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా, బీజేపీ 25 స్ధానాల్లో విజయం సాధించింది. బీజేపీ మద్దతుతో 2015 మార్చిలో ముఫ్తీ మహమద్ సయిీద్ సీఎం అయ్యారు. అయితే సీఎం అయిన ఏడాది గడవకుండానే ఆయన మరణించారు. అయితే తండ్రి సయిీద్ మరణం తర్వాత…మూడు నెలలపాటు ఇంటికే పరిమితమైన మెహబూబా ముఫ్తీ 2016 ఏప్రిల్-4 న జమ్ము-కశ్మీర్ మొదటి మహిళా సీఎంగా భాధ్యతలు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates