బీజేపీని ఓడించాల్సిందే:  శత్రుఘ్న సిన్హా

భారత ప్రభుత్వ ప్రతిపాదనలతో రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అగ్రిమెంట్ లో రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌ సంస్థ భాగస్వామి చేసుకుందని ఫ్రాన్స్‌ మీడియా తెలిపిన విషయాన్ని గుర్తుచేస్తూ బీజేపీ అసంతృప్త నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హా విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న ఆయన.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని రఫేల్ వివాదంపై మాట్లాడి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘భారత ప్రభుత్వ ఇష్ట ప్రకారమే రిలయన్స్‌ను డసో.. తమ స్థానిక భాగస్వామిగా ఎంచుకుందన్నారు. యుద్ధ విమానాలను తయారు చేయడంలో చాలా అనుభవం ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) వంటి దేశీయ సంస్థను పక్కకు పెట్టి, డిఫెన్స్‌లో కొత్తదైన సంస్థను ఇందులో ఎందుకు భాగస్వామిని చేశారని ఆయన ప్రశ్నించారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని శత్రుఘ్న సిన్హా ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతలంతా ఏకమై బీజేపీని ఓడించాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates