బీజేపీపై కుమారస్వామి సంచలన ఆరోపణ : ఒక్కో ఎమ్మెల్యేకి రూ.100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు

kumaraswamy-BJPకర్నాటక రాజకీయం రసకందాయంలో పడింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. 17వ తేదీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి తీరతానని తొడకొట్టి మరీ చెప్పారు బీజేపీ పక్షనేత యడ్యూరప్ప. ఇదే టైంలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి మీడియా ముందుకు వచ్చారు. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యేలను చీల్చటానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తుందని యడ్యూరప్ప వర్గంపై సంచలన ఆరోపణలు చేశారు. 100 కోట్లతోపాటు మంత్రి పదవి కూడా ఇస్తామని చెబుతున్నారని.. ఇలాంటి కుట్రపూరిత వ్యూహాలను తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలోని ప్రజలందరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని మోడీ.. ఆ డబ్బును ఎమ్మెల్యేల కొనుగోలుకి ఖర్చు చేస్తున్నాడని విమర్శించారు. ఎలాగైనా కర్ణాటకలో అధికారం చేపట్టాలనే బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందన్నారు. కర్ణాటక ప్రజల అభివృద్ది కోసమే.. కాంగ్రెస్ తో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అయినట్లు చెప్పారు. తాము అధికార దాహంతో కాంగ్రెస్ తో చేతులు కలపలేదన్నారు. ఈరోజు ఆపరేషన్ కమలంకి ఆకర్షితులైతే.. వారిని చరిత్ర క్షమించదన్నారు. కర్నాటక ప్రజలు దీన్ని గమనించాలన్నారు. సంస్థలను బీజేసీ దుర్వినియోగం చేస్తుంది.

Posted in Uncategorized

Latest Updates