బీజేపీపై తొలిసారి పైచేయి.. రాహుల్ గాంధీ సక్సెస్ సీక్రెట్స్ ఇవే

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ .. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా. 2014 తర్వాత బీజేపీ పై కాంగ్రెస్ కు దక్కిన అసాధారణ విజయం ఇది. రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని నమోదు చేయడం… ఆరునెలల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా లాభించేదే. హిందీ మాట్లాడే ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయానికి రాహుల్ గాంధీ ఫాలో అయిన స్ట్రాటజీ ఆసక్తి కలిగిస్తోంది. డిసెంబర్ 2017లో పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీకి .. పార్లమెంట్ సాధారణ ఎన్నికల ముందు ఇది ఓ బూస్ట్ లాంటిది.

  • అంతర్గత సర్వేలను నమ్మిన రాహుల్… చత్తీస్ గఢ్ లో అజిత్ జోగీతో జోడీ కట్టలేదు. మాయావతి, జోగీ కూటమితో… బీజేపీ ఓట్లు చీలాయి. కాంగ్రెస్ కు లాభం కలిగించింది. ఐదేళ్ల కిందట… గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలోని 700 అసెంబ్లీ సీట్లలో.. కాంగ్రెస్ గెలిచింది 179 సెగ్మెంట్లలో మాత్రమే. కానీ ఇప్పుడది 358కి పెరిగింది.
  • ఎన్నికల వేళ రాహుల్ గాంధీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో మొత్తం 82 సభలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీపై అవినీతి ఆరోపణలు చేశారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, ఎస్సీ, గిరిజనులను పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు.
  • రాజస్థాన్ లో ఐదేళ్లుగా రాహుల్ , సచిన్ పైలట్ గ్రాస్ రూట్ లో పనిచేశారు. కేడర్ తో కలిసి పార్టీకి ఊపునిచ్చారు. యువతను ఆకర్షించారు.

శక్తియాప్ – బ్రహ్మాస్త్రం
ఈ ఎన్నికల్లో విజయానికి రాహుల్ ఉపయోగించిన బ్రహ్మాస్త్రంగా శక్తి యాప్ ను చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశమంతటా 45 లక్షలమంది కార్యకర్తలు శక్తి యాప్ లో రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్లందరితోనూ.. రాహుల్ గాంధీ నేరుగా స్పందించే వీలుంది. ఒక టూ వే కమ్యూనికేషన్ ను యాప్ లో ఎస్టాబ్లిష్ చేశారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో పార్టీ, ప్రగతి అంశాలపై కార్యకర్తలు ఈ యాప్ లో నేరుగా హైకమాండ్ కు చెప్పొచ్చు. అలా పబ్లిక్ పల్స్ ను తెల్సుకున్నారు రాహుల్ గాంధీ. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చారు. “నేను కాదు.. మనం” అనే మెసేజ్ ను జనంలోకి తీసుకెళ్లారు రాహుల్ గాంధీ.

  • మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియాలతో… సీనియర్లు, సమర్థులతో కలిసి పనిచేశారు.
  • గతంలో బీజేపీలాగే.. ఈసారి రాహుల్ గాంధీ యాక్టివ్ గా ముందుండి… సోషల్ మీడియా క్యాంపెయిన్ ను బాగా నడిపించారు.
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి చేసుకున్నారు.

జంధ్యం… తిరుగులేని వ్యూహం

  • ఆఖరుగా… జంధ్యం వేసుకుని హిందూ ఓట్లను హస్తగతం చేసుకున్నారు రాహల్ గాంధీ. జన్యుధారి శివభక్తుడిగా రాహుల్ చేసిన ప్రయత్నం .. కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రో-మైనారిటీ ఫీలింగ్ మార్చేందుకు ఉపయోగపడింది. గుడులకు వెళ్లి హిందువుల ఓట్లను కూడా ఆకర్షించగలిగారు రాహుల్ గాంధీ.
Posted in Uncategorized

Latest Updates