బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయింది: మమతా బెనర్జీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ దారుణంగా విఫ‌ల‌మైంది.ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాలపై స్పందించిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ…ప్రజా తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. ఇది ప్రజల తీర్పని.. ఈ దేశ ప్రజల విజయమని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్ళడాన్ని ప్రజాస్వామ్య విజయమన్న మమత… ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌ను బీజేపీ అణిచివేసిందని ఆరోపించారు. డిమానిటైజేష‌న్ లాంటి చ‌ర్య‌ల‌తో ఆ పార్టీ సాధార‌ణ పౌరుల‌ను దెబ్బ‌తీసింద‌న్నారు.

అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కడా బీజేపీ లేదని సెమీ ఫైనల్స్ రుజువు చేస్తున్నాయన్నారు. 2019 ఫైనల్ మ్యాచ్‌కు ఇది నిజమైన ప్రజాస్వామిక సంకేతమన్నారు. అంతిమంగా ప్రజలు ఎప్పుడూ ప్రజాస్వామ్యపు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పారు. విజేతలకు అభినందనలు తెలిపారు మమత.

Posted in Uncategorized

Latest Updates