బీజేపీలో చేరిన బాబుమోహన్

టీఆర్ఎస్ MLA బాబుమోహన్‌ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన బాబుమోహన్… ఇవాళ(సెప్టెంబర్-29) బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో కమలం కండువా కప్పుకొన్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత సీఎం కేసీఆర్ 105మందితో ప్రకటించిన తొలి జాబితాలో బాబుమోహన్ పేరు లేదు. బాబుమోహన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆందోల్‌ లో.. టీఆర్ఎస్ అభ్యర్ధిగా  జర్నలిస్ట్ క్రాంతికిరణ్‌ ను‌ ప్రకటించారు.  టీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడంతో కొన్నిరోజులుగా బాబుమోహన్‌ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న బాబుమోహన్‌.. ఈరోజు బీజేపీలో జాయిన్ అయ్యారు.

Posted in Uncategorized

Latest Updates