బీజేపీ అబద్దపు ప్రచారాలు చేస్తుంది : మొహబూబా ముఫ్తీ

mehaమాజీ భాగస్వామి బీజేపీ తమపై అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మోహబూబా ముఫ్తీ. అలయన్స్ అజెండా రూపకల్పనలో రామ్ మాధవ్, రాజ్ నాథ్ లు కూడా పాల్గొన్నారన్నారు. ఆర్టికల్ 370పై స్టేటస్ కో, పాకిస్థాన్, హురియత్ కాన్ఫరెన్స్ లతో చర్చల విషయం అజెండా అలయన్స్ లో ఉందన్నారు. నిన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జమ్మూ పర్యటన సందర్భంగా… పీడీపీ తీవ్ర విమర్శలు చేశారు. వాటికి కౌంటర్ గా వరుస ట్వీట్లు చేశారు ముఫ్తీ. అలయన్స్ అజెండాను తామెన్నడూ పక్కనబెట్టలేదని… బీజేపీనే దూరం జరిగిందని ఆరోపించారు ముఫ్తీ.  మొహబూబా ముఫ్తీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. అలయన్స్ అజెండాను పీడీపీ విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు ఏం చేశారో చెప్పాలని ముఫ్తీని నిలదీశారు.

Posted in Uncategorized

Latest Updates