బీజేపీ ఎన్నికల నినాదం : నిజాయితీతో పని చేద్దాం.. అభివృద్ధి సాదిద్దాం

modiబీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు.. మోడీ ప్రధాని అయ్యి నాలుగేళ్లు అయ్యింది. మరో ఏడాదిలో ఎన్నికలు. ఇప్పటి వరకు చేసినవి సరే.. మరి చేయబోయేది కూడా చెబితేనే కదా ప్రజలు ఓట్లు వేసేది. అందుకే 2019 ఎన్నికలకు బీజేపీ కొత్త నినాదం పుట్టించింది. నిజాయితీతోనే సంపూర్ణ అభివృద్ధి నినాదంతో మోడీని సరికొత్తగా ప్రమోట్ చేయబోతున్నది పార్టీ. అందుకుగాను ప్రత్యేకంగా టీం తయారు చేసింది. మే 26వ తేదీతో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ఈ నినాదం ప్రచారంలోకి తీసుకురాబోతున్నది భారతీయ జనతా పార్టీ.

మే 26వ తేదీన కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా 40 నగరాల్లో ఈ నినాదంతోనే సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి అతిపెద్ద టీం గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. మోడీ పాలనలో అవినీతి లేదని.. కుంభకోణాలు లేవని చెప్పటంతోపాటు.. నిజాయితీతో ఉన్నప్పుడే అభివృద్ధి సాకారం అవుతుంది అనే వాదనను జనంలోకి తీసుకెళ్లబోతున్నారు. నాలుగేళ్లలో ఒక్క కుంభకోణం కూడా లేదని.. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన తప్పిదాలను సరిదిద్దటానికి, పాలనను గాడిలో పెట్టటానికే సమయం సరిపోయిందని.. మరో ఐదేళ్లలో దేశంలో మరిన్ని మార్పులతో సంపూర్ణ అభివృద్ధి దిశగా తీసుకెళ్లటమే మోడీ లక్ష్యం అనేది ఈ నినాదం ఉద్దేశం. మొత్తానికి నిజాయతీతోనే అభివృద్ధిని ప్రజలు ఎంత వరకు ఆమోదిస్తారో చూడాలి…

Posted in Uncategorized

Latest Updates