బీజేపీ ఎమ్మెల్యేపై కేసు : ఇప్తార్ విందుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు

raja singhఇఫ్తార్ పార్టీలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేసు నమోదయ్యింది. గోషామహల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ నగరంలోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయ్యింది. రాజకీయ నాయకులు ఓట్ల కోసమే ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే తన వీడియో పోస్టులో ఆరోపించారు. ఎవ్వరికీ ఇఫ్తార్ ఇవ్వను, ఎవరైనా పిలిచినా ఆ విందుకు హాజరుకానంటూ వీడియోలో స్పష్టం చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్.

Posted in Uncategorized

Latest Updates